తెలంగాణలో త్వరలో 9 MLC స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి 3, ఇండిపెండెంట్లు 2, ఎంఐఎం నుంచి 1 స్థానం మార్చి నాటికి ఖాళీ కానుండటంతో ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మండలిలో ఇప్పటి వరకూ బీఆర్ఎస్దే మెజార్టీ ఉంది. దీంతో ఖాళీ స్థానాలన్నింటినీ ఖాతాలో వేసుకునే దిశగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ కూడా పట్టు నిలుపుకోవాలని భావిస్తోంది.