సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న మహాధర్నాలో సోమవారం కేటీఆర్ పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి 28 సార్లు ఢిల్లీ వెళ్లి.. రాష్ట్రానికి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సొంత నియోజకవర్గ గిరిజన, దళిత ప్రజలను కలిసేందుకు సమయం లేదు.. సొంత ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని విమర్శంచారు.