సిర్గాపూర్ మండలం గోసాయిపల్లికి చెందిన సుమలత ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 12, 000 రూపాయల చెక్కును సోమవారం లబ్ధిదారులకు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణ గౌడ్, స్కూల్ చైర్మన్ గంగారం, నల్లావాగు మాజీ ఉపసర్పంచ్ నాగభూషణం, నర్సింలు తదితరులు ఉన్నారు.