విక్టరీ వెంకటేష్ నటించిన గురు చిత్రం ఏప్రిల్ 7న థియేటర్స్ లోకి రానున్న సంగతి తెలిసిందే. మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇరుది సుట్రు చిత్ర రీమేక్ గా గురు చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలోని పాటలను డైరెక్ట్ గా నెట్ లోకి విడుదల చేస్తున్న టీం ఇప్పటి వరకు రెండు సాంగ్స్ విడుదల చేసింది. సంతోష్ నారాయణ్ సంగీతంలో రూపొందిన ఈ సాంగ్స్ సినీ లవర్స్ ని ఎంతగానో అలరిస్తున్నాయి. తాజాగా ఎయ్ పఠాకే అనే మూడో సాంగ్ విడుదల చేశారు. అనంత్ పాడిన ఈ పాటకు భాస్కర్ బట్ల లిరిక్స్ రాశారు. మాతృకకి దర్శకత్వం వహించిన సుధా కొంగర తెలుగు వర్షెన్ గురు కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో రితికా సింగ్ కథానాయికగా నటించింది. తాజాగా విడుదలైన సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa