ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీదేవి మృతిపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2018, 11:33 AM

న్యూఢిల్లీ : నటి శ్రీదేవి మృతిపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీదేవిది కచ్చితంగా హత్యేనని స్వామి ఆరోపించారు. ఆరోజు రాత్రి హోటల్ గదిలోకి ఎవరు వెళ్లారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదు. మరి ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని స్వామి ప్రశ్నించారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని మొదట ఎవరూ చెప్పారని ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రీదేవికి బలవంతంగా ఎవరైనా మద్యం తాగించరా? అన్నది తేల్చాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa