హైదరాబాద్: హెచ్‌ఐసీసీలో రెండో రోజు జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సు జరుగుతోంది. ఈ గవర్నెన్స్-బెస్ట్ ప్రాక్టీసెస్ అనే అంశంపై ప్యానెల్ డిస్కషన్ జరుగుతోంది. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, సివిల్ సైప్లె కమిషనర్ సీపీ ఆనంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటానికి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. హ్యాక్‌ఐ, టీఎస్ కాప్, లాస్ట్ రిపోర్టు, ట్రాఫిక్ లైవ్, ఈ పెట్టీ కేస్ లాంటి 24 యాప్‌లు తీసుకొచ్చినం. పాస్‌పోర్టు వేరిఫికేషన్‌లో దేశంలోనే ముందున్నాం. పోలీస్, ఆర్టీఏ కలిసి తీసుకొచ్చిన ఎం వ్యాలెట్ యాప్‌కు మంచి స్పందన ఉంది. ట్రాఫిక్ చలానాలను ఈ చాలన్ల ద్వారా క్యాష్‌లెస్ చేసినం. హైదరాబాద్‌లో 2 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినం. ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడానికి టెక్నాలజీని వాడుతున్నం. గత నాలుగేళ్లుగా ఎలాంటి మేజర్ క్రైం లేకుండా ప్రశాంతంగా ఉందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa