హైదరాబాద్: బడ్జెట్లో మత్స్యకారులు, గొర్రెల కాపరుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం కేసీఆర్కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. మత్స్యకారులు మంత్రి తలసానితో కలిసి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్కు చేపలను బహూకరించారు. గొర్రెల కాపరులు సీఎంకు గొంగడి, గొర్రె పిల్లను బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రి తలసానికి స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. తమ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎం కేసీఆర్కు మత్స్యకారులు, గొర్రెల కాపరులు కృతజ్ఞతలు తెలిపారు.