ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత రాజకీయాల్లో ఈరోజు చిరస్మరణీయం: యోగి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 03, 2018, 03:27 PM

న్యూఢిల్లీ: మూడు ఈశాన్య రాష్ట్రాల్లో వెలువడుతున్న ఫలితాలు, బీజేపీ ప్రభంజనంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. భారత రాజకీయాల్లోనే ఈ రోజు చాలా ముఖ్యమైన రోజని ఆయన అభివర్ణించారు. 'త్రిపురలో బీజేపీ చారిత్రక విజయం నమోదు కానుంది. ఇందుకు ప్రధాని మోదీ, అమిత్‌షా, పార్టీ కార్యకర్తలకు ముందుగా నా అభినందనలు. నాగాలాండ్, మేఘాలయాలోనూ బీజేపీ అదరగొట్టే పనితీరు ప్రదర్శించింది. చక్కటి ఫలితాలు రాబట్టింది. ఈరోజు భారత రాజకీయాల్లోనే చాలా కీలకమైన రోజు' అని యోగి ఆదిత్యనాథ్ సంతోషం వ్యక్తం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa