హైదరాబాద్: నగరంలోని రెయిన్‌బజార్ పీఎస్‌లో తలాక్ కేసు నమోదైంది. భార్యకు తెలియకుండానే తలాక్ పత్రాలను పంపిన మహ్మద్ ఖదీర్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు ద్వారా తలాక్ పత్రాలు చేరడంతో మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఖదీర్ తలాక్ పత్రాలను శాలిబండకు చెందిన ఖాజీ ద్వారా పంపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa