జయశంకర్ భూపాలపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడడారు. ఈ విషాద సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా హైదరాబాద్-భూపాలపట్నం రహదారిపై చోటుచేసుకుంది. దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి కారులో మంగపేట మండలం మల్లూరు దేవస్థానానికి వచ్చారు. దర్శనానంతరం హైదరాబాద్‌కు తిరిగి వెళ్తుండగా తాడ్వాయి మండల కేంద్రం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa