మణిపూర్, గోవా రాష్ట్రాల్లో బీజేపీ తీరుపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గవర్నర్ అధికారాలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. డబ్బు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందని అయన అన్నారు. యూపీ, ఉత్తరాఖండ్ లో ఓటమిని అంగీకరించిన రాహుల్ గెలుపు ఓటములు సహజమన్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ రెండుచోట్ల, తాము ప్రజాస్వామ్య బద్ధంగా మూడుచోట్ల గెలిచామని చెప్పారు. బీజేపీ ఏ ఐడియాలజీకి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామో అదే ఐడియాలజీ ప్రకారం బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోందని వ్యాఖ్యానించారు.