సీఎం కేసీఆర్ వల్లే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. గత పాలకులెవరూ ఈ పనులకు నిధులు కేటాయించలేదని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక, ప్రత్యేకంగా రైల్వే లైన్ కు నిధులు కేటాయించడంతో మోక్షం లభించిందన్నారు. సిద్దిపేట జిల్లా గిరిపల్లి వద్ద మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం గజ్వేల్ లో వైకుంఠ ధామంను ప్రారంభించారు.