హైదరాబాద్ : గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సనత్‌నగర్ రైల్వే యార్డ్ వద్ద డౌన్‌లైన్‌లో వెళ్లే గూడ్స్ రైలు కిందపడి సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు షర్టుపై నలుపు గీతలు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, ఎడమ చేతిపైన సత్తమ్మ అని పచ్చ బొట్టు ఉన్నది తెలిపారు.