ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ కంచుకోటలో పెరుగుతున్న విభేదాలు!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 01:17 AM

-త్వరలో రాష్ట్ర వ్యాప్త పాదయా్తక్రు సిద్దమవుతున్న కోమటిరెడ్డి
-ఉత్తమ్‌ నాయకత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం
-తెలంగాణలో కాంగ్రెస్‌ను ఖతం పట్టిస్తున్నారని విమర్శ
-పొన్నాల కంటే బలహీనమైన అధ్యక్షుడంటున్న బ్రదర్‌‌స
-రాజకీయాల నుండి రిటైర్మంట్‌ ప్రకటిస్తానంటున్న జానారెడ్డి
-సూర్యాపేటలో బలం పెంచుకుంటున్న దామోదర్‌రెడ్డి
-కోమటిరెడ్డి సోదరులపై పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఆగ్రహం

 మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్న జిల్లాలలో అవిభక్త నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. గడిచిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలోను ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంచి మెజారిటీతో విజయం సాధించారు. జిల్లాకు చెందిన ఇద్దరు సీని యర్‌ ఎమ్మెల్యేలు కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  కోమటిరెడ్డి సోదరుల హవా కొనసాగేది. తెలంగాణ ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేసి కాంగ్రెస్‌ అధిషానానికి తన నిరసననను తెలిపారు. పార్టీ బలంగా ఉంది. ఇక్కడి నేతలే కాంగ్రెస్‌ పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. అయినా అధికార పార్టీ లోకి వలస వెళ్లే నేతలను మాత్రం వారు ఆపలేకపోవడం కాంగ్రెస్‌ పార్టీకి మైనస్‌గా మారింది.  నల్గొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఇటీ వలే కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేశారు. మరో సీనియర్‌ ఎమ్మెల్యే ీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఈ ప్రచారాన్ని ఖండిస్తూ తాను కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రెడ్ల రాజకీయాలకు కేంద్రంగా ఉండే నల్గొండలో పార్టీని కాపాడుకోకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు హెచ్చ రిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మొత్తం మూడు వర్గాలుగా విడిపోయింది. ఓ గ్రూపుకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. మరో గ్రూపుకు కోమటిరెడ్డి సోదరులు నేతృత్వం వహిస్తుండగా అన్ని వర్గాలను సముదాయించే పనిని సిఎల్‌పి నేత జానారెడ్డి తన భుజాన వేసుకున్నారు. ప్రతి నియోజక వర్గంలోను గ్రూపు రాజకీయాలు కొనసాగుతుండడంతతో పార్టీ అధిష్ఠానం చాలా సీరియస్‌గా ఉంది. రాష్ట్ర పార్టీని నడిపించాల్సిన నాయకులు జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తుండడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే ఈ పరిణామాలకు పుల్‌ స్టాప్‌ పెట్టాలనే యోచనలో ఉన్నారు. 


టిఆర్‌ఎస్‌ నేతలతో టచ్‌లో ఉంటున్న కోమటిరెడ్డి బ్రదర్‌‌స...
 టిఆర్‌ఎస్‌ అగ్రనేతలతో కోమటిరెడ్డి సోదరులు టచ్‌లో ఉంటున్నారని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆరోపిస్తుంది. గతంలో హరీష్‌రావుతో సమా వేశమయిన వెంటనే  విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసిన వెంకట్‌ రెడ్డి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పొన్నాల కంటే బలహీనమయిన నాయకుడంటూ ఘాటుగా వ్యాఖ్యా నించారు. ఆయన వైఖరి వల్లే కాంగ్రెస్‌ పార్టీ నారాయణ ఖేడ్‌, పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఓటమి పాలయిందని మండిపడ్డారు. మంత్రులు సవాల్‌ చేసిన పిసిసి చీఫ్‌గా పారిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వ మార్పు పై స్పష్టమైన ప్రకటన చేయకుంటే పార్టీ మునిగిపోక తప్పదన్నారు. కాంగ్రెస్‌ క్యాడర్‌ను నడిపే శక్తి ప్రస్తుత నాయకత్వా నికి లేదని, ప్రతి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ రోజురోజుకు బలహీనంగా తయారవు తుందన్న ఉత్తమ్‌ రాబోయే ఎన్నికల నాటికి కార్యకర్తలు ఎవ్వరు పార్టిలో మిగిలే పరిస్థితులు లేవన్నారు. పార్టీ నాయకత్వంపై దిక్కార స్వరం వినిపించిన ఆయన సిఎం కెసిఆర్‌ పాలననను పొగడ్తలతో ముంచెత్తారు. ఓ వైపు కాంగ్రెస్‌ నేతలపై విమర్శల వర్షాన్ని కురిపిస్తూనే తాను మాత్రం నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు హరీశ్‌రావుతో సమావేశమ య్యానని చెప్పడం కొసమెరుపు.
ఉత్తమ్‌కు మద్దతు ప్రకటించిన పాల్వాయి, బిక్షమయ్య గౌడ్‌
  కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరులు పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కు వ్యతిరేకంగా వ్యవహ రిస్తుండడంతో ఆయన వర్గం అప్రమత్తమయింది. కోమటిరెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభ ఎంపి పాల్వాయి గోవర్దన్‌రెడ్డితో పాటు నల్గొండ డిసిసి అధ్యక్షులు బిక్షమయ్య గౌడ్‌లు రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయిన వీరు కోమటిరెడ్డి సోదరుల తీరును తప్పు పడుతూ ఫిర్యాదుల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర నాయ కత్వాన్ని మార్చాల్సిన అవసరం లేదన్న వీళ్లు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఉత్తమ్‌ నేతృత్వంలోనే వెళ్లలనే సలహను ఇచ్చినట్లు సమాచారం. వీరికి జిల్లా లోని మరికొందరు నేతలు కూడా మద్దతు పలికారని తెలుస్తోంది. కోమటి రెడ్డి గ్రూపులో నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఉత్తమ్‌ గ్రూపులో మిగిలిన నేతలు ఉన్నారు. సిఎల్‌పి నేత జానారెడ్డి మాత్రం రాజకీయాలకు రిటైర్మంట్‌ ప్రకటిస్తతూ వచ్చే ఎన్నికలలో తన కుమారున్ని రంగంలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొ న్నాయి. మరో బలమైన నేత రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి మాత్రం తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేటకే పరిమితమవుతూ అక్కడ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో ఆయన ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com