హైదరాబాద్, మేజర్‌న్యూస్ : తెలంగాణ శాసన సభ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ తెదేపా శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నా రన్న కారణంతో సస్పెండ్ చేయడం రాజ్యాంగ విరుద్దమని రేవంత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగం సభ పరిధిలోకి రాదని, గవర్నర్ ప్రసంగం పూర్తయిన తర్వాతే సభ ప్రారంభమవుతుందన్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగే ఘటనలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని.. వాటిలో ఎక్కడా సభ్యుల సస్పెన్షన్ ప్రస్తావనే లేదని తెలిపారు. తనపై సస్పెన్షన్‌ను చట్ట విరు ద్ధంగా ప్రటకించి ఆ ఉత్తర్వులను కొట్టివేయాలని హైకోర్టును రేవంత్‌రెడ్డి కోరారు.