రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే గొర్రె పిల్లలకు ఇన్సూరెన్స్, జియో ట్యాగింగ్ చేస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 75 శాతం సబ్సిడీతో రాష్ట్రంలోని 4 లక్షల కురుమ, యాదవుల కుటుంబాలకు 84 లక్షల గొర్రె పిల్లలు పంపిణీ చేస్తామన్నారు. రాష్ర్టంలోని వాతావరణానికి అనుకూలమైన గొర్రె పిల్లలనే కొనుగోలు చేస్తున్నట్లు తలసాని వెల్లడించారు. 60 ఏళ్ల చరిత్రలో గత ప్రభుత్వాలు గొల్లకురుమల సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి తలసాని మండిపడ్డారు .