రాంచీ : పెళ్లికి ఒప్పుకోలేదని కుటుంబాన్ని హత్య చేసిన ఘటన జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన మార్చి 14న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. రామ్‌సింగ్ శిర్కా, పాను కుయ్ దంపతులకు కూతురు రంభ(17), కుమారులు కాండే(12), సోన్యా(8) ఉన్నారు. అయితే రంభను పెళ్లి చేసుకునేందుకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితుడు ప్రపోజల్ పెట్టాడు. పెళ్లి అయిన వ్యక్తికి తన కూతురునిచ్చి వివాహం చేసేందుకు రామ్‌సింగ్ ఒప్పుకోలేదు. వివాహితుడి అభ్యర్థనను తిరస్కరించినందుకు రామ్‌సింగ్ కుటుంబంపై అతడు కక్ష పెంచుకున్నాడు. మార్చి 14న రామ్‌సింగ్ కుటుంబాన్ని హత్య చేసి గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోని అడవిలో మృతదేహాలను పడేశారు. ఈ ఘటనపై రామ్‌సింగ్ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa