డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని హెలీపాడ్ వద్ద ప్రమాదం జరిగింది. ఆకస్మాత్తుగా ఆర్మీ కార్గో హెలికాప్టర్‌లో మంటలు చెలరేగాయి. ల్యాండింగ్ సమయంలో ఇనుప రాడ్‌ను ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa