హైదరాబాద్ : ఉద్యమాలకు ఊపిరి పోసిన ధర్నాచౌక్‌ను తరలించాలనుకోవడం తగదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఇది నిజాం కాలం కాదని ఆయన పేర్కొన్నారు. మూడేళ్ల టిఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, ఈ క్రమంలోనే ప్రభుత్వం ధర్నా చౌక్‌ను తరలించాలని నిర్ణయం తీసుకుందని లక్ష్మణ్ అన్నారు. ధర్నాచౌక్‌పై ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలు తమ హక్కులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు ధర్నాచౌక్ వద్ద ఆందోళనకు దిగడం రాజ్యాంగం కలిపించిన హక్కని ఆయన పేర్కొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa