ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వడగాల్పుల నివారణకు హీట్‌ వేవ్‌ యాక్షన్‌ప్లాన్‌ రూపొందించండీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 01:08 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః వేసవిలో ఎండలు తీవ్రతరం కానున్న దృష్టా్య ప్రభుత్వం ఎండలపై దృష్టిసారించింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుండి 47 డిగ్రీల వరకు చేరుకొనే అవకాశం ఉందని, వడగాల్పుల బారిన పడకుండా  తగు నివారణ చర్యల కోసం హీట్‌ వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌ ను రూపొందింంచాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్వి శేఖర్‌ప్రసాద్‌సింగ్‌ అన్నిశాఖల ముఖ్య అధికారులను ఆదేశించారు. ఎండల నుంచి  ప్రజలను ఎప్పటికప్పుడు అప్ర మత్తం చేయాలని   ఎస్‌.పి.సింగ్‌ కోరారు.  గురు వారం హీట్‌ వేవ్‌ యాక్షన్‌ ప్లాన్‌ పై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  బి.ఆర్‌.మీనా, పశు సం వర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  సురేష్‌ చందా, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ , పంచాయతీ రాజ్‌ కమీషనర్‌  నీతూ ప్రసాద్‌, పాఠ శాల విద్యా శాఖ డైరెక్టర్‌ కిషన్‌ , ఇంటర్‌ బోర్డు కమీ షనర్‌ అశోక్‌, వ్యవసాయ శాఖ కమీషనర్‌        ఎం.జగన్‌ మోహన్‌ , విపత్తుల నిర్వహణ శాఖ స్పె షల్‌ కమీషనర్‌  సదాబార్గవి లతో పాటు , వైద్య , టూరిజం, రవాణా , ఐ.యం.డి., ఐటి , జి.హెచ్‌. ఎం.సి, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌ ఎస్పీ సింగ్‌  మాట్లా డుతూ వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక పై గత సంవత్సర అనుభవాలను దృష్టి్టలో ఉంచి కొని ప్రస్తు త వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల సమయంలో ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా అన్ని శాఖలు పకడ్బందిగా చర్యలు తీసుకోవాలని అన్నారు. హీట్‌ వేవ్‌ కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి సంబ ంధిత శాఖలు సిద్దం కావాలని, సిబ్బందికి తగు శిక్షణను ఇవ్వాలని సి.యస్‌ అన్నా రు. వడ గాల్పులకు సంబంధించి చేపట్టవలసిన చర్య లపై సర్కు్యలర్‌ ను జిల్లా కలెక్టర్లకు పంపిం చాలని, ఈ అంశంపై ప్రత్యేకంగా జిల్లా కలెక్ట ర్లతో వీడియో కాన్ఫరెన్‌‌స నిర్వహించాలని సి.యస్‌ రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు. చిన్న పిల్లలు, వృద్దులు, కార్మికులు, పశువులు వడదెబ్బ కు అత్యధికంగా గురయ్యే అవకాశం ఉందని, వడ గాల్పుల సమయంలో తగు జాగ్రత్తలు తీసుకు నేలా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలన్నారు. వాతా వరణ శాఖ ఎప్పటికప్పుడు అత్యధిక ఉష్ణా గ్రతల వివరాలనుల రూపంలో జిల్లా కలెక్టర్లకు, సంబ ంధిత అధికారులకు సందేశాలను ఎప్పటి కప్పుడు పంపించాలని సి.యస్‌ సూచించారు. అత్యధిక ఉష్ణోగ్రతల సమయంలో ప్రజలు చేయ వలసింది, చేయకూడని అంశాల తోపాటు, ఆరో గ్య సమస్య లపై తగు పోస్టర్లు, కరపత్రాలు , అడ్వర్‌ టైజ్‌ మెం ట్లు  పత్రిక లలో సమాచార శాఖ ద్వారా విస్తౄఎత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.


వైద్య ఆరోగ్య శాఖ  తగు మందులు అందు బాటులో ఉంచుకోవాలని , ప్రజలకు ఆరోగ్య సల హాలు, సూచనలు అందివ్వాలని, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేయాలని సి.యస్‌ ఆదేశించారు. వడదెబ్బకు గురుయ్యే ప్రభావిత ప్రాంతాలను, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేయాలన్నారు. ఉపాధి కార్మికులు పనిచేసే ప్రాంతాలలో , మంచి నీటి సదుపాయం, ఫస్‌‌ట ఎయిడ్‌ సదుపాయం, మెడి కల్‌ కిట్‌‌స అందుబాటులో ఉంచాలని అత్యధిక ఉష్ణో గ్రతలు ఉన్న రోజు మధ్యాహ్నం 12 గం.ల నుండి 4 గం.ల సమయంలో పనులను ఆపాలని ఉద యం, సాయంత్రం సమయాలలో పనిచే సేలా  చూ డాలని పంచాయతీరాజ్‌ శాఖ కమీషనర్‌ ను ఆదేశి ంచారు. భవన నిర్మాణ రంగం కార్మికులు, ప్రయి వేట్‌ కార్మికులు పనిచేస్తున్న ప్రాంతాలలో ఎండ వేడికి గురి కాకుండా యాజమాన్యాలు తగు సదుపాయాలు కల్పించేలా కార్మిక శాఖ అధి కారులు చూడాలన్నారు. వేసవిలో బస్‌ స్టాండ్‌ లలో ప్రయణీకులకు మంచినీరు, అందుబాటులో ఉంచా లని, అత్యధిక ఉష్ణోగ్రత సమయంలో బస్సుల సమ య వేళలు మార్చాలని సి.యస్‌ అన్నారు.


భక్తులకు నీడనివ్వాలి....


దేవాలయాలను సందర్శించే భక్తులు ఎండ బారి న పడకుండా నీడ కలిగేలా నెట్‌‌స , మంచినీటి సదు పాయం కల్పించేలా దేవాదాయ శాఖ అధి కారు లను ఆదేశించారు. తెలంగాణ ను సందర్శించే యా త్రికులను అప్రమత్తం చేయడంతో పాటు , టూర్‌ అపరేటర్ల ద్వారా టూరిస్టు స్పాట్‌లలో యాత్రికు లను చైతన్యం చేయాలని అన్నారు. 


వడదెబ్బకు గురయి మరణాలు సంభవించిన …ప్పుడు రెవెన్యూ , పోలీసు , వైద్య అధికారులలో కూ డిన కమిటీ తగు విచారణ చేసి నివేదిక సమర్పించి బాధితులకు సహాయం అందేలా చూడాలన్నారు. 2015 లో 541 మంది , 2016 లో 324 వడదె బ్బల వల్ల మరణించారని , వడదెబ్బ వలన కలిగే అస్వస్థత పై వైద్య శాఖ ప్రజలను అప్రమత్తం చేయ డానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వడ గాల్పుల కార్యాచరణ ప్రణాళిక పై జిల్లా స్థాయి, మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఐ.యం.డి. ద్వారా ప్రతి రోజు ఉష్ణాగ్రతల వివరాలు తెలుపుతారని, కొన్ని జిల్లాలను గ్రూపులుగా ఏర్పరచి హెచ్చరికలు జారీచేస్తారని ఆయన అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa