-అప్పులతో ఏ అభివృద్ధి చేశారో చెప్పాలి
-ప్రతి మనిషిపై రూ. 40 వేల అప్పు
-అప్పులు తీసుకురావడం అసమర్థ పాలనకే లెక్క
-టీడీపీ టీఎస్ నేతలు రేవంత్, సండ్ర
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధిః అప్పులు చేయ డమే గొప్ప విషయం అన్నట్లు చెప్పుకుంటున్న ముఖ్య మంత్రి చంద్రశేఖర్‌రావు ఆయన కుమారుడు కేటీఆర్‌లు ఇద్దరు కలిసి రాష్రా్టన్న్రి అప్పుల ఊబిలోకి నెడుతున్నారని టీటీడీఎల్పీనేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆయన గురువారం అసెంబ్లీ మీడియా ఫాయింట్‌లో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. అరవై ఏళ్ల కాలంలో 17మంది ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలంగాణపై అరవై వేల కోట్లు అప్పుచేస్తే గత రెండున్నరేళ్ల కాలంలో కేసీఆర్ తెలంగాణ అప్పును రూ. 1.50 లక్షల కోట్లకు పెంచారన్నారు. ఈ విషయం గురించి విపక్షాలు విమర్శించినప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లు అప్పులు చేస్తేనే అభివృద్ధి జరగుతుందని చెప్తున్నారని, పైగా ఆ విధంగా అప్పులు తేవడం కొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ హయంలో తీసుకొచ్చిన అప్పులతో ఏ రంగాన్ని అభివృద్ధి చేశారో, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చారో చెప్పాలని డిమాండ్‌చేశారు. సంపన్న రాష్ట్రంగా మొదలైన తెలంగాణ కేసీఆర్ పాలనలో మూడేళ్ల కాలానికి దివాళాతీసి అప్పుల తెలంగాణగా మారిపోయిం దని విమర్శించారు. ఆరు లక్షల కోట్లు అంటూ కేసీఆర్ తలతిక్క వాదనలు చేస్తున్నారని విమర్శించారు. అభివృ ద్ధిలో మహారాష్ట్రతో పోలిక పెడుతున్న కేటీఆర్‌కు అక్కడి జనాభా 11 కోట్ల అన్న సంగతి గుర్తులేదా.. రాషా్ట్ర నికి అప్పులు, కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు పెరుగు తున్నాయని ఆరోపించారు.అసమర్థులు మాత్రమే అప్పు చేసి పప్పుకూడా తినడం గొప్పనుకుంటారని ఎద్దేవా చేశా రు. ఇప్పటికే తెలంగాణ ప్రజలపై తలసరి రూ.40వేల అప్పు ఉందని తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశం లోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా తెలంగాణ మారు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లీష్, ఉర్దూ భాష ల్లో పత్రికలు, వందలాది ఎకరాలలో ఫాంహౌస్‌లు ఎక్కడ నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఆస్తులను పెంచు కుంటున్న కేసీఆర్ కుటుంబం అప్పులు మాత్రం ఎందుకు పెరగడంలేదో చెప్పాలన్నారు. అభివృద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రంలో అప్పులు చేస్తున్న మాట వాస్తవమే అయితే శాసనసభలో రెండు రోజులపాటు ఇదే అంశంపై సుదీర్ఘ చర్చ నిర్వహించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడక ముం దు ఉన్న అప్పులు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా చేసిన అప్పులతోఒపాటు అప్పుగా తెచ్చిన నిధులను దేనికోసం ఖర్చుచేశారన్న విషయాలను కూడా కూలంకషంగా చర్చిస్తే తెలంగాణ ప్రజలందరికి జరుగుతున్నదేమీటో అర్థమవు తుందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది చేయకుండా అప్పులకోసమే కొత్తపథకాలను ప్రవేశపెడుతూ, కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ బంగారు తెలంగాణ స్థానంలో బాకీల తెలంగాణ తయారుచేస్తే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు 100 ఏళ్ల జైలు శిక్ష, వెయ్యి కొరడా దెబ్బలు పడతాయని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌చేశారు.
ఆధారాలు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వ నిజస్వరూపం తేలిపోయిందని.. కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నిం చారు. వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్‌ను జారీ చేసిన అధికారపక్షమే అది అమలుకాకుండా కోర్టుకు వెళ్లిందని సండ్ర ఆరోపించారు. వారసత్వ ఉద్యోగాల విషయంగా కార్మికులలో ఆశలు రేపి చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పు కున్న సీఎం కేసీఆర్ జారీ చేసిన తర్వాత ఏదో విధంగా నియామకపు ప్రక్రియ నిలిచిపోతుందని కార్మికులు అనుమానించిందే నిజమైందన్నారు. వారసత్వ ఉద్యో గాలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన వారు కూడా అధికార పార్టీకి చెందినవారేనని సండ్ర అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో వారసత్వ ఉద్యోగాలకు వ్యతిరేకంగా కోర్టు లో కేసు దాఖలు చేసింది ఏవరో, దానిని ప్రోత్సహించి ముందుకు ఎవరో విచారణ నిర్వహించి నిజనిజాలను కార్మికులకు తెలియచేయాలని సండ్ర డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa