ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవసరమైన చోట వంతెనలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 17, 2017, 01:15 AM

  -రూ. 829 కోట్లతో 514 బ్రిడ్జిలు, చెక్‌ డ్యాం ల నిర్మాణం
  -వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 వేల పాఠశాలల్లో టాయిలెట్‌‌స నిర్మాణం
  -మహిళాసంఘాలను మరింత బలోపేతం చేసేలా కార్యాచరణ
  -బ్యాంకులతో పాటు స్త్రీ నిధి ద్వారా మహిళలకు రుణాలు
  -గతంతో పోలిస్తే  300 శాతం పెరిగిన రుణాలు
  -మంత్రి జూపల్లి కృష్ణారావు


హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధిః కురిసిన ప్రతి వర్షం నీటిని వడిసి పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గతంలో రోడ్డు బ్రిడ్జీలు మా త్రమే చేపట్టేవారని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్‌-కం-బ్రిడ్జీల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ విధానంతో నీటినిల్వ ఉంటుందని, దీంతో భూగర్భజలాలు పైకి వస్తాయన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  అవసరమైన ప్రతి చోట వంతెనలు, చెక్‌ డ్యాంలు నిర్మిస్తామని కృష్ణారావు స్ప ష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వంతెనల నిర్మా ణంపై „పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇస్తూ రూ. 829 కోట్లతో 514 బ్రిడ్జీలు చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 85 వంతెనల నిర్మాణం పూర్తి చేసినట్లు సభకు తెలిపారు. మరో 222 వంతెనలు, 91 బ్రిడ్జి కమ్‌ చెక్‌ డ్యాంల  నిర్మాణం పురోగతిలో ఉందన్నారు. పాఠశా లల్లో టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ వచ్చే ఆర్ధిక సంవ త్సరంలో బాలుర పాఠశాలల్లో 1740, బాలి కల పాఠ శాలల్లో 1260 టాయిలెట్లను నిర్మించ నున్నట్లు తెలిపారు. మొత్తంగా 6 వేల టాయి లెట్ల అవసరమున్నట్లు గుర్తించామన్నారు. అలాగే వడ్డీలేని రుణాలపై కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.


మహిళల సాధికారత కోసం చర్యలు : జూపల్లి     


హైదరాబాద్‌ : రాష్ట్రంలోని మహిళల సాధికారత కోసం ప్రభు త్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని  జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నదే ప్రభు త్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. మహిళల ఆదాయం పెరిగేలా చర్య లు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మహిళా సంఘాలున్నాయని తెలిపారు. మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళా సంఘాలకు నిధుల కొరత లేదన్నారు. 2012-13 నుంచి ఇప్పటి వరకు పోల్చుకుంటే మహిళలు మూడింతల రుణ సౌకర్యం కల్పిం చామని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్నారు. మహిళాసంఘాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెద్దఎత్తున రుణాలు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే దాదాపు 300 శాతం అధిక మొత్తంలో రుణాలు ఇచ్చినట్లు అంకెలతో వివరించారు. బ్యాంకులతో పాటు స్త్రీనిధి ద్వారా కూడా రుణాలిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 4 లక్షల స్వశక్తి సంఘాల మహిళలకు 2015-16 లో రూ. 5 వేల 290 కోట్లు, 2016-17 లో రూ.6 వేల 861 కోట్లు రుణాలిచ్చినట్లు మంత్రి తెలిపారు. మరో ప్రశ్నకు సమాధానంగా అభయహస్తం పథకం నిలిపివేయలేదని, లబ్ధిదారులకు మరింత ప్రయేజనం చేకూర్చేలా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోనున్నట్లు తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa