-ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాం
-బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సి ఉంది
-మత పరంగా కాకుండా సామాజిక అంశంపైనే
హైదరాబాద్, సూర్యప్రధానప్రతినిధిః గత ఎన్నికల్లో ముస్లీం రిజర్వేషన్లు పెంచుతామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలు చేసేందుకు అడుగులు ముందుకుసాగుతున్నాయి. భూమి, ఆకాశాన్ని ఏకం చేసైనా ముసి ్లములకు 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో అవసరమైతే దేశవాప్తంగా అన్ని రాషా్టల్ర ముఖ్యమంత్రులను కలుపుకొని పెద్దయెత్తున ఉద్యమానికి సిద్ధమని అన్నారు. తమిళనాడులో రిజరే ్వషన్లపై అక్కడి శాసనసభలో చేసిన తీర్మానాన్ని కేంద్రం ఏ విధంగా 9వ షెడ్యూల్‌లో చేర్చిందో.. అదే తరహాలో తెలంగాణలోనూ ముస్లిం రిజర్వేషన్లపై ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేస్తామని, దానిని షెడ్యూల్ 9లో చేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వివరించారు. ఈ విషయంలో కాం గ్రెస్ సహా మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రధాని మోదీని కలిసి విన్న విద్దామని చెప్పారు.
గతంలో దేశాన్ని పాలించిన ముస్లింలలో ఇప్పుడు ఎంతో మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందుకే తెలంగాణలో వారికి రిజర్వేషన్లు కల్పించి చేయూ తనివ్వాలని భావిస్తున్నాం. తెలంగాణలో 90.7 శాతం బలహీన వర్గాలే ఉన్నా రు. బీసీలకు కూడా రిజర్వేషన్లు పెంచాలి. అసలు రిజర్వేషన్ల అమల్లో రాషా్టల్రకు స్వేచ్ఛ కల్పించాలి అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ముస్లిం రిజర్వేషన్ల విష యంలో కేంద్రం సహకరించకుంటే, అన్ని పార్టీలు కలిసి ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద ధర్నా చేద్దామని ప్రతిపక్షాలను కోరారు. మతపరంగా కాదని, సామా జిక, ఆర్థిక అసమానతల ఆధారంగా జరగాలని కోరుతూ ప్రధానిని కలుద్దామని ప్రతిపాదించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ కేంద్రం రాషా్ట్ర లకే అనుమతి ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం 100% కట్టుబడి ఉందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa