హైదరాబాద్, మేజర్‌న్యూస్‌ః భూమి-ఆకాశం ఏకం చేసైనా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ప్రకటించడం చూస్తుంటే... ఆయనకు రాజ్యాంగం మీద, కోర్టుల మీద గౌరవం లేనట్లు స్పష్టమవుతోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
రాజ్యాంగబద్దం కాని ముస్లిం రిజర్వేషన్ల బిల్లు పెట్టడాన్ని నమ్మడానికి రాష్ట్ర ప్రజలు అమాయకులు కారని అన్నారు. గతం లో ఆంద్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లపై కోర్టులు స్పష్టమైన తీర్పు ఇచ్చి, మత పరమైన రిజర్వేషన్లు చెల్లవని చెప్పినప్పటికీ కేసీఆర్ అదే బాటలో కొనసాగడం ముస్లింలను మోసం చేయడ మేగాక బీసీలకు ద్రోహం చేయడమే అవు తుందన్నారు. ఓట్లు పొందడానికి చేస్తున్న ఈ రాజ కీయ ప్రక్రియను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరే కిస్తుందని తెలిపారు. గులాబీ కండువాలు వేసుకొని జిల్లాల్లో టీఆర్‌ఎస్ నేతలు తిరుగుతూ, ముస్లిం రిజ ర్వేషన్లు బలపర్చడం దుర్మార్గమైన చర్య అని అన్నా రు. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అవమానపర్చడమేనని ఆయన స్పష్టం చేశారు. సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటుతనం, విద్యా, ఉద్యోగాలలో విస్మరించబడ్డ వారికి రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
బీసీల రాజ్యాంగ హక్కులైన విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ముస్లింల సంక్షేమ, అభివృద్ది కొరకుగాక ఫక్తు రాజకీయాల కొరకు, ముస్లిం ఓట్లు కొరకు మాత్రమేనని లక్ష్మణ్ విమర్శించారు. చట్టబద్దత, రాజ్యాంగబద్దత లేని 100 శాతం అమలుకు నోచుకోని ఈ బిల్లు ప్రవేశ పెట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తమ రాజకీయ దివాళా కోరుతనాన్ని చాటుకుంటుదని విమర్శిం చారు. రాజ్యాంగ బద్దత, చట్టబద్దత ఉన్న సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా తమ పార్టీ చేపడుతోందని ఆయన తెలి పారు. తెలం గాణలో కళ్లెదుట జరుగుతున్న దగాకోరు రాజకీ యాలను చూస్తూ సహించమని హెచ్చరించారు.
ఇటీవల ఐదు రాషా్టల్ల్రో జరిగిన ఎన్నికలలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కుల, మత రాజకీయా లు పనిచేయలేని స్పష్టమైందన్నారు. 19.8 శాతం ఉన్న ముస్లిం ఓటర్లు సగానికి పైగా తమ పార్టీకి మద్దతు పలికారని తెలిపారు. 57శాతం ఉన్న దళితుల్లో ఎక్కువ శాతం బీజేపీకి మద్దతు తెలి పిన విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa