ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యాధికారమే లక్ష్యం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 18, 2017, 12:37 PM

 బడుగు బలహీనవర్గాల రాజ్యాధికారమే లక్ష్యం : తమ్మినేని వీరభద్రం
కేసిఆర్‌ పాలనలో పల్లెలు కన్నీరు
సామాజిక సమగ్ర అభివృద్ధితోనే తెలంగాణ ప్రజలకు న్యాయం  
మహాజన పాదయా్తక్రు ఘనస్వాగతం పలికిన సూర్య అధినేత నూకారపు సూర్యప్రకాశ రావు  
బడుగులకు అన్యాయం చేస్తే ఉద్యమాలే
జనాభా దామాషా ప్రకారం రాజకీయాలలో సీట్లు కేటాయించాలి: నూకారపు  
పాదయా్తక్రు బ్రహ్మరథం పట్టిన ప్రజలు  
పార్టీలకతీతంగా స్వాగతం

యాదాద్రి భువనగిరి బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నిక లలో బడుగు బలహీనవర్గాల రాజ్యాధికారమే లక్ష్యంగా సిపిఎం మహాజన పాదయాత్ర చేపట్టడం జరిగిందని తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టి సామాజిక సమగ్ర మహాజన పాదయాత్ర భువనగిరికి చేరుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడుతూ  జనాభాలో 93 శాతం ఉన్న బడుగు బలహీనవర్గాల సంక్షేమాన్ని కేసిఆర్‌ ప్రభుత్వం విస్మరించిందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి నేడు మోసపూరిత మాటలతో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఈ పాదయాత్ర చేపట్టినట్లు 5 నెలల్లో 4 వేల కిలోమీటర్లు తిరగడం జరిగిందన్నారు. పాదయాత్రలో ఎన్నో సమస్యలపై ప్రజలకు తమకు వినతిపత్రాలు అందజేయడం జరిగిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బిసిల బడ్జెట్‌ అనడం విడ్డూరంగా ఉందని ఒక లక్షా 49 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో 56 శాతం ఉన్న బిసిలకు 80 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 5 వేల కోట్లు ఇవ్వడం పట్ల బిసిలపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమను గుర్తు చేశారు.  ఈ సందర్భంగా ఇప్పటివరకు 90 వేల దరఖాస్తులకు పైగా ప్రజల నుంచి వచ్చినట్లు వచ్చిన దరఖాస్తుల్లో ముఖ్యమంత్రి సంబంధిత శాఖలకు లేఖలు రాస్తానని వీరభద్రం అన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓబిసి, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆర్థిక సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఈ పాదయాత్రలో సర్వే చేసినట్లు ఆయన తెలిపారు.





ఈ నెల 19న హైద్రాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగే సామాజిక, సంక్షేమ సమరభేరీ సభతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమం ప్రకటిస్తామని అప్పటి వరకు హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజల బతుకులకు తెలంగాణ కావాలని కోరుకున్నారు తప్పా బంగారు, వెండి తెలంగాణ కోరుకోవడం లేదన్నారు.  సూర్య దినపత్రిక అధినేత నూకారపు సూర్యప్రకాషరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ర్ట బడ్జెట్‌లో జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించకుండా అన్యాయం చేసిందన్నారు. అర్హు్హలైన పేద ప్రజలందరికీ ప్రభుత్వ పించన్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు సామాజికంగా ఆర్ధికంగా ముందుకు రాణించేందుకు జరుగుతున్న ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బిసి సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షులు జాజుల శ్రీని వాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అందరికీ అన్యాయం జరుగు తుందని చెప్పిన కేసిఆర్‌ నేడు దొరల పాలన సాగిస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాల్సిన బిసి లు నేడు శాసనసభలో కేవలం పదుల సంఖ్యలో ఉండి మాట్లాడలేని స్థితిలో ఉన్నారని అన్నారు. 2019 ఎన్నికలలో బిసిలకు జనాభా శాతం ప్రకారం సీట్లు కేటాయించాలని అన్నారు. చేతినిండాపనిలేక పెరిగిన నూలు, రసాయన ధర లతో చేసిన వస్త్రాలకు మార్కె ట్‌లో గిరాకీ లేక కడుపునిండా తిండిలేక చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసు కుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ వారి కుటుం బాలను పరామ ర్శించలేదని విమర్శించారు. ఈ బహిరంగసభకు సిపిఎం పట్టణ కార్యదర్శి మాయ వహించగా సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్‌, తిరందాసు గోపి, జాన్‌వెస్లీ, సీనియర్‌ పాశం యాదగిరి, సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు బుచ్చిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, వెంకటేశ్వర్లు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమదేవి, వృత్తిదారులు సంఘం నాయకులు, అబ్బాస్‌, పైళ్ల ఆశయ్య, సోమన్‌ నాయక్‌, నగేష్‌, రాజు, రైతు సంఘం నాయకులు కొండమడుగు నర్సింహ్మ, చింతల భూపాల్‌రెడ్డి, నర్సింహ్మ, కల్లూరి మల్లేశం, మేక అశోక్‌రెడ్డి, కొత్త అంజయ్య, కాంగ్రెస్‌ నాయకులు తంగెళ్లపలి రవి కుమార్‌, బీసుకుంట్ల సత్య నారాయణ, బర్రె జహంగీర్‌, పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, టిడిపి నాయకులు ఎలిమినేటి సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాదయాత్రకు పలు పార్టీల నాయకుల స్వాగతం.మహాజన పాదయాత్ర శుక్రవారం భువనగిరి చేరుకున్న సందర్భంగా పట్టణంలో పలు పార్టీల నాయకులు పాదయాత్రసభ్యులకు పూలమాలలు, శాలువాలతో ఘనస్వాగతం పలికారు. తమ్మినేని వీరభద్రం ఆయన బృం దానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తంగెళ్లపలి రవికుమార్‌, బర్రెజహంగీర్‌, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ్మ, టిడిపి పార్టీ నాయకులు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఎక్బాల్‌చౌదరి తదితరులు స్వాగతం పలికారు.  


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com