ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు సమస్యలను హరీశ్‌రావ్‌ దృష్టికి తీసుకెళ్లిన రేవంత్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 23, 2017, 12:21 PM

వరంగల్‌: తెలంగాణ రైతు సమస్యలను తెదేపా నేత రేవంత్‌రెడ్డి రాష్ట్రమంత్రి హరీశ్‌రావ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఆందోళనలో పాల్గొన్న రేవంత్‌ రైతు సమస్యలను ఫోన్‌లో హరీశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మిర్చి, కంది పంటలకు ధరకల్పించాలని ఆయన మంత్రిని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన హరీశ్‌రావ్‌ ప్రభుత్వం తరపున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తెదేపా ఆధ్వర్యంలో ఎనుమాముల నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రేవత్‌రెడ్డితోపాటు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa