జైపూర్ : బీజేపీ నేత, రాజస్థాన్ మంత్రి కాళిచరణ్ సరాఫ్ వివాదంలో చిక్కుకు న్నారు. అత్యాచారాలను అరికట్టడం సాధ్యం కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వివరాల్లోకి వెళితే, నగ ల దుకాణం యజమాని ఇంటిలో పని చేస్తు న్న ఓ వ్యక్తి యజమాని కుమార్తెపై అత్యా చారం చేశాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో పెరిగిపోతున్న అత్యాచారాల గురించి మీడియా ప్రతినిధులు ఆయనను ప్రశ్నించారు. దీంతో, ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఏం చేస్తుందని ఆయన మండిపడ్డారు. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవడం, బాధితురాలికి మంచి వైద్య సహాయం అందించడం మినహా మరేం చేయలేమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి తాళాలు వేయమంటారా అని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.