ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లిచూపుల నిమిత్తం తల్లితో కలసి లండన్‌ వెళ్లిన రణబీర్‌ కపూర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 12, 2017, 01:58 AM

ముంబయి : తన కుమారుడు రణబీర్‌ కపూర్‌కు బాలీవుడ్‌ నటిని భార్యను చేసేందుకు ససేమిరా అంటున్న నీతూ సింగ్‌ కపూర్‌ ఓ లండన్‌ అమ్మాయిని చూసేందుకు కొడుకుతో సహా వెళ్లినట్టు తెలుస్తోంది. మీడియాలో వచ్చిన కథనాల మేరకు లండన్‌లోని ఓ వ్యాపార దిగ్గజం కుమార్తెతో పెళ్లిచూపుల నిమిత్తం వీరు వెళ్లినట్టు సమాచారం.  నీతూ దగ్గరి సన్నిహితురాలు ఈ సంబంధాన్ని పరిచయం చేయగా, వీరిద్దరి వివాహం కూడా దాదాపు ఖరారైనట్టేనని వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో రణబీర్‌ కపూర్‌ తొలుత దీపికా పదుకొణెతో, ఆపై కత్రినా కైఫ్‌తో ప్రేమాయణం సాగించినప్పటికీ, అవి పెళ్లి పీటల వరకూ చేరలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఈ లండన్‌ అమ్మాయి అయినా రణబీర్‌కు ఫైనల్‌ అవుతుందో? లేదో? అధికారికంగా తెలియాల్సి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com