ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముత్యమంతా పసుపు ముఖమెంతొ ఛాయ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2017, 01:53 AM

పసుపు భారదేశంలో ఎప్పటి నుండి ఉంది అంటే దాదాపు ఆరు వేల సంవ త్సరాల నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి వాడుతున్నారు. బౌద్ధ శిష్యులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్త్రాలు ధరించా రని తెలుస్తోంది. పసుపు అల్లం జాతికి చెందిన దుంప. ఈ దుంప లోపలంతా పసుపు రంగులో ఉండటం వలన దీనికి పసుపు అని పేరు వచ్చిందని చెబుతారు.


పసుపులో విటమినులు, లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్‌ ఫాస్ఫరస్‌ గూడా అధికంగానే ఉంటుంది. పసుపు రేణువులో వివిధ జీవన ప్రక్రియలకు తోడ్పడే యాంటీ బయోటిక్‌, కాన్సర్‌ నిరోధక, ఇన్‌ఫ్లమేషన్‌ నిరో ధించేవి, ట్యూమర్‌ కలుగకుండా వుండే, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కలిగి ఉన్న వందలాది పరమాణువులున్నాయి. పసుపు దుంపల్లో కర్‌క్యుమిన్‌ అనే ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఈ కర్‌క్యుమిన్‌ అనే పదార్థం వల్లననే పసుపు సహజమైన పసుపు రంగులో ఉంటుంది. ఇప్పటివరకు పసుపులో బంగారు వన్నెలో వుండే కర్‌క్యుమిన్‌, డిమిథాక్సి కర్‌క్యుమిన్‌, బిస్‌డిమిథాక్సి కర్‌క్యుమిన్‌ అనే పదార్థాలపై అత్యంత పరిశోధనలు జరిగాయి. పసుపు దుంపలో కర్‌క్యుమిన్‌ కేవలం 3 నుంచి 5 శాతమే ఉన్నప్పటికీ శరీర సౌంద ర్యానికి, శరీర ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.


ఎన్నో వ్యాధులకు మందు : పసుపులో ఉండే కర్కుమిన్‌  అనే పదార్ధము మతి మరుపును అరికడుతుంది. నీళ్ళలో ఒక పసుపు కొమ్ము వేసి రాత్రంతా నాన బెట్టి తాగితే...ఈ నీళ్లు కొలెస్టిరాల్‌ను, రక్తపోటును అదుపులో ఉంచుతాయి. జామ ఆకులు పసుపుతో కలిపి నూరిన మిశ్రమాన్ని మొఖనికి రాయడం వలన మొటిమలు తగ్గుతాయి.


పసుపు వలన ఉపయోగాలు : నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.


.మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్‌ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పిప్పిపళ్లు నివారింపబడతాయి. వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు. పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్‌ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది. హాని కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. నీళ్ల విరేచనాలు/ రక్త విరేచనాలకు ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా 2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపో వచ్చు. మూల వ్యాధి (పైల్స్‌)తో బాధపడేవారు పసుపు, ఆవనూనె, ఉల్లిరసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్‌ ఉన్నచోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం.  ఆల్కహాల్‌ ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది. క్యాన్సర్‌ను చంపే గుణం ఒక్క పసుపు లోనే ఎక్కువగా ఉంది. పసుపు శరీరంలోని ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు తదితర భాగాలలో కాన్సర్‌ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో కాన్సర్‌ దరిచేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని వివిధ కణాలను కాన్సర్‌ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఎప్పుడైనా కణితి (ట్యూమర్‌) ఏర్పడితే దాన్ని నిర్మూలించేట్లు చేస్తుంది.పసుపుకు క్యాన్సర్‌ కణాలను తుదముట్టించే సామర్థ్యం ఉన్నట్లు , పసుపులో ఉండే కర్కుమిన్‌ అనే రసాయనానికి 24 గంటల్లోపే క్యాన్సర్‌ కణాలను చంపే శక్తి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కర్కుమిన్‌కు గాయాలు నయం చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com