ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోదా అవినీతి అస్త్రాలు?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 27, 2017, 01:40 AM

-టిడిపిపై సమరానికి వైసిపి సమాలోచనలు
-ప్యాకేజీని నమ్ముకొన్న టిడిపి దానికి చట్టబద్ధత తెచ్చుకోలేదని ఎత్తిచూపే యోచన?
-హోదాపై యువభేరీలతో సెంటిమెంటు రగిల్చే యోచన
-అవినీతి అస్త్రాలూ ప్రధానమేనన్న భావన?
-బాబు ఆస్తులపై మరింత దాడి పెంచాలన్న యోచన
-అధికార టిడిపిపై నలువైపుల నుంచి దాడికి వైసిపి వ్యూహం

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : సార్వత్రిక ఎన్నికలు మరో రెండున్నరేళ్లలో ఉండటంతో అధికార టిడిపిపై రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచుతోంది. ఓవైపు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా అధికార పార్టీ తీసుకొని జనం మెప్పుపొందే ప్రయత్నం చేస్తుంటే అందులోని అవినీతిని ఎత్తిచూపడం ద్వారా ప్రభుత్వం యోక్క చిత్తశుద్ధిని ప్రశ్నించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్దమవుతోంది. ఇదే సందర్భంలో ప్రత్యేక హోదా అంశం వచ్చే ఎన్నికల నాటికి సెంటిమెంటుగా బలపడే అవకాశమున్నందున్న ఆ అసా్తన్న్రి తనకు అనుకూలంగా మల్చు కోవాలని జగన్‌ పార్టీ భావిస్తోంది. హోదాకంటే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీయే మిన్న అన్న అధికార టిడిపి ఇటీవల పార్లమెంటు సమావేశాలలో దాని చట్టబద్దత కోసం ప్రయత్నం చేసింది. కానీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత మాత్రంకల్పించలేదు. దీనిని కూడా తనకు అనుకూలంగా మల్చుకొని రాష్ట్రం బాగుపడ్డాలంటే ప్రత్యేకహోదాయే మార్గమన్న సెంటిమెం టను రగిల్చాలని వైసీపీ సమాలోచనలు చేస్తోంది.
మరోవైపు ఇటీవల కొన్ని నెలల కిందట నారా వారి కుటుంబ ఆస్తులను నారా లోకేష్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆస్తులపై ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముప్పేట దాడిని ప్రారంభించింది. అదే సందర్బంలో ఏపీ మంత్రుల అవినీతిపైనా విమర్శలు గుప్పించింది. అవినీతి అసా్తల్రను కూడా ఎక్కిపెట్టడం ద్వారా అధికార టిడిపిని ఇరకాటంలోకి నెట్టాలని ఆ పార్టీ సమాలోచనలు చేస్తోంది. ప్రజానికానికి నేరుగా ప్రభావం చూపే సమస్యల తోపాటు అవినీతిని ప్రధానంగా ఎత్తిచూపాలని వైసీపీ భావిస్తున్నటు సమాచారం. ఈ క్రమంలో రాష్ర్టంలోని మంత్రివర్గ సభ్యుల అక్రమ ఆస్తులు, వారి అవినీతిని ప్రధానంగా స్థానిక నేతలు ఎక్కడికక్కడా ఎత్తిచూపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం ఇప్పటికే సంకేతాలు పంపినట్లు సమా చారం. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజానికంలో ఓ సెంటిమెం టుగా మార్చాలని వైసిపి సమాలోచనలు చేస్తోంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఇంకా పరిశ్రమలు రాకపోవడం, నిరుద్యోగ సమస్యలు తీరడంలేదని చెబుతున్న వైసిపి నేతలు ఈ సమయంలో ప్రత్యేక హోదా వస్తే యువత భవిష్యత్తు మారేదన్న ప్రచారం చేయాలని ఆ పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక నిరంతర వాణి? : గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటాలు చేసినా అవి నిరంతర పోరాటాలుగా సాగలేదు. అయితే ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉండటంతో ఇక నిరంతరంగా ప్రజా సమస్యలపై, టిడిపి సర్కార్‌ అవినీతిపై, రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న అవినీతిని ఎత్తిచూపాలని, ఏపీకి ప్రత్యేకహోదా ప్రస్తుత పరిస్థితుల్లో  రాషా్టన్రికి ఎంత అవసరమన్న విషయాన్ని ప్రజానికానికి తెలియజేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపైనా వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి యువభేరీలను పలు ప్రాంతాలు ఇప్పటికే నిర్వహించారు. ఈ యువ భేరీలు ప్రాంతాల వారీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని రాష్ట్ర ప్రజానికం పట్టించుకొంటున్నారా అన్న దిశగా అంతర్గతంగా ప్రజాభిప్రా యానికి దిగిన వైసీపీ నాయకత్వం జనం నాడిని పట్టడంవల్లే యువభేరీల పేరుతో హోరు సాగిస్తోందని సమాచారం. యువత ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఏపీకి ప్రత్యేకహోదాను సాధించుకోవాలన్న తపనతో ఉన్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇందుకోసం తమ పార్టీ అనేక మార్గాల్లో పోరాటాలు సాగిస్తుందని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలావుంటే రాజధాని అమరావతి నిర్మాణంలో వచ్చే ఎన్నికల నాటికి కనీసంగా 20శాతం పనులు పూర్తిచేసినా జనం మద్దతు తమకు దక్కుతుందని అధికార టిడిపి నేతలు పేర్కొంటున్నారు. అయితే ఈ రాజధాని అమరావతి పేరుతో పెద్ద అవినీతి జరుగుతోందంటున్న వైసీపీ నేతలు వాటిని జనంలోకి విసు్తత్రంగా తీసుకెళ్తామని చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల మంత్రుల వ్యక్తిగత అవినీతి పెరుగుతోందని దానిపై కూడా మేం విసు్తత్ర ప్రచారం నిర్వహిస్తామని వైసీపీ ముఖ్యనేత ఒకరు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లే రాఘునాథ్‌రెడ్డి తదితరులపైనా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు నారావారి కుటుంబ ఆస్తుల వివరాలను ఇటీవల కొద్దిరోజుల కిందట నారా లోకేష్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  దీంతో ఆ కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థ విలువ, చంద్రబాబు నివాసం విలువ, ఇంత ఆస్తుల విలువలను ఇప్పటికే ఎత్తిచూపిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు దానిని మరింత జనంలోకి విసు్తత్రంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఓ కారణమైతే నాడు టిడిపి సర్కార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా ఆయన అదే స్థాయిలో జనంలోకి తీసుకుపోవడం కూడా ఓ కారణంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇదే తరహా దాడిని ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభిస్తుందని మరో ముఖ్యనేత వ్యాఖ్యనించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa