న్యూఢిల్లీ : విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీని విపక్ష పార్టీల నేతలు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇవాళ పార్లమెంట్ లైబ్రరీ భవనంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో 17 పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. గోపాలకృష్ణ గాంధీ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా పని చేసిన విషయం విదితమే. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa