గోమాంస నిషేధంలో భాగంగా పశువుల విక్రయాలపై కేంద్ర జారీచేసిన ఆదేశాల అమలుపై మద్రాసు హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ స్టేను సమర్థిస్తూ దీన్ని దేశం మొత్తం అమలు చేయాలని సుప్రీంకోర్టు ప్రకటించింది. కేంద్ర ఆదేశాలపై హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కేంద్రానికి వ్యతిరేకంగా వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో భారత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో కేంద్ర ఆదేశాలకు వ్యతిరేకంగా వచ్చిన నిరసనల వల్ల పశువుల విక్రయ నిషేధ చట్టంపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. ఇదే తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. త్వరలోనే ఈ చట్టం అమలు చేయడానికి సంబంధించిన ప్రత్యామ్నాయ చర్యలను చేపడతామని కేంద్రం కోర్టుకు తెలిపింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa