టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కేవలం క్రికెట్‌తోనే కాదు... తన వ్యక్తిగత అభిరుచులతో కూడా ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతూనే ఉంటాడు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన దశలోనే జులపాల జుట్టుతో ధోనీ అందరినీ ఆకట్టుకున్నాడు. ధోనీ తర్వాతే టీమిండియా ప్లేయర్లు తమ హేర్ స్టైల్స్ తో ప్రయోగాలు మొదలుపెట్టారు. ఇక అప్పట్లో ధోనీ హేర్ స్టైల్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కూడా ఇప్పటి వరకూ ధోని విభిన్న స్టైల్స్ తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.
ఇక మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న మరో ప్రత్యేక అభిరుచి ‘బైక్స్’. ఇంటర్నేషనల్ కెరీర్ ఆరంభం అయిన తర్వాత, కెప్టెన్ అయ్యాకా కూడా ధోనీ అప్పుడప్పుడు రాంచీ వీధుల్లో బైక్ నడిపి వార్తల్లో నిలిచాడు. అలాగే క్రికెట్ మ్యాచ్ లప్పుడు తన సహచరులు ఎవరైనా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా బైక్ ను పొందితే.. వాటిని ముందుగా నడిపేది ధోనీనే. సదరు బైక్ ను పొందిన సహచరుడిని వెనుక కూర్చోబెట్టుకుని మైదానంలో ఒక రౌండ్ వేసేవాడు ధోనీ. ఇలాంటి సంఘటనలు ధోనీకి బైక్స్ మీద గల మోజును చాటి చెప్పాయి.
ధోనీకి బైక్స్ పై ఉన్న మోజును చాటిచెప్పే మరో విషయం ఇది. ధోనీ దగ్గర ఉన్న బైక్స్ సంఖ్యను బట్టి ఈ జార్ఖండ్ డైనమేట్ కు వాటిపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ధోనీ ధగ్గర 42 నుంచి 44 బైక్స్ ఉన్నాయట.. ఈ విషయాన్ని చెప్పాడు రవీంద్ర జడేజా. అసలు కరెక్ట్ నంబర్ ఎంతో ధోనీకి కూడా తెలియదని జడేజా చెప్పడం గమనార్హం.
తన దగ్గర కరెక్టుగా ఎన్ని బైకులున్నాయో ధోనీకే తెలియదట. ఆ స్థాయిలో ఉంది ధోనీ సేకరణ. అంతేకాదు, ఉన్న బైకుల్లో సగం బైక్స్ ను ధోనీ ఇంతవరకూ నడిపిందే లేదట.. ఏవో కొన్నింటి మీద మాత్రమే రైడ్ చేశాడట. నిరంతరం క్రికెట్ తో, ఇతర యాక్టివిటీస్ తో బిజీగా ఉండి.. బైక్ నడిపే సమయం లేకపోయినా.. సేకరణను మాత్రం ఆపడం లేదట. దటీజ్ ధోనీ!