హైదరాబాద్ : హరితహారంలో విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయమని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. రాజ్‌భవన్ స్కూల్‌లో నిర్వహించిన గ్రీన్‌డే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ రాజ్‌భవన్‌లో మొక్కలు నాటేందుకు గవర్నర్ చొరవ తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యాశాఖ ఆధ్వర్యంలో నేడు నగరంలోని అన్ని విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రతి పాఠశాలలో ఒక్కో మొక్కను కాపాడే బాధ్యత విద్యార్థులకే అప్పజెప్తున్నామన్నారు. రాజ్‌భవన్ హైస్కూల్‌లో గవర్నర్ వచ్చి మొక్కలు నాటడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొని మొక్కలునాటి, హరిత తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరారు.