భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దుమ్ముగూడెం మండలంలోని గుబ్బల మంగి వాగు పొంగడంతో 8 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద ఎగువ నుంచి వరద నీరు చేరడంతో 8 గేట్లను ఎత్తి 11,200 క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వాగులు, ప్రాజెక్టుల్లోకి నీరు చేరడంతో భద్రాచలం వల్ల గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వవద్ద గోదావరి నీటిమట్టం 17 అడుగులకు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతం పచ్చదనంతో కళకళలాడుతోంది.