జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళి, డీఎఫ్‌వో రవికిరణ్ ప్రయాణిస్తున్న జీపు బురదలో దిగబడిపోయింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు కాటారం మండలంలోని ప్రతాపగిరి అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ సమయంలో జీపు బురదలో దిగబడిపోవడంతో ఫారెస్టు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. మొత్తానికి కలెక్టర్, డీఎఫ్‌వోను సురక్షితంగా జీపులో నుంచి బయటకు తీశారు. అనంతరం జీపును బురదలో నుంచి బయటకు నెట్టారు ఫారెస్ట్ సిబ్బంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa