శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి జిల్లా కేంద్రం నుంచి కొండాపూర్ గ్రామానికి బస్సు సర్వీస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన స్పీకర్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీని కాపాడేందుకు నెలకు ఒకసారి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తానని స్పీకర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇవాళ బస్సులో ప్రయాణించినట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని చెప్పారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa