ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాస్‌పోర్టుకు బర్త్ సర్టిఫికేట్ తప్పసనిరి కాదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 24, 2017, 11:41 AM

పాస్‌పోర్టు పొందడానికి తప్పనిసరిగా జనన ధృవీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్) సమర్పించాలన్న నిబంధనను మినహాయించేలా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బర్త్ సర్టిఫికేట్ కు బదులుగా ఆధార్, పాన్ కార్డులను సైతం అనుమతించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం గతవారం పార్లమెంటుకు వివరించింది. పాస్ పోర్టు రూల్స్-1980 ప్రకారం జనవరి 26 1989 పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా బర్త సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంది. అయితే స్కూలు బదిలీ సర్టిఫికేట్, పదో తరగతి సర్టిఫికేట్ (మెమో), వంటి పత్రాలు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఎల్‌ఐసీ పాలసీ బాండ్ల సర్టిఫికేట్లను కూడా బర్త్ సర్టిఫికేట్లుగా సమర్పించేందుకు అనుమతించేలా సవరణ చేయనున్నారు.


ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీస్, పెన్షన్ రికార్డు వంటివి కూడా అనుమతించేలా చట్టం చేయనున్నారు. అనాథలు అనాథాశ్రమాలు జారీ చేసే పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకునేలా సవరణ చేయనున్నట్లు కేంద్రమంత్రి వీకే సింగ్ వెల్లడించారు. కొత్త పాస్ పోర్టులోని సమాచారం ఇంగ్లిష్ తో పాటు హిందీ కూడా ఉండనుంది. అంతేకాదు 60ఏళ్లు పైబడ్డ వారు 8ఏళ్ల లోపు చిన్నారులకు పాస్‌పోర్టు ఛార్జీలో 10శాతం డిస్కౌంట్ పొందనున్నారు.ఇప్పటికే పాస్‌పోర్టు జారీలో పలు సవరణలు చేసిన ప్రభుత్వం మరింత సరళతరం చేసేందుకు చర్యలు చేపట్టింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa