హైదరాబాద్ : స్వైన్ ఫ్లూ అనే మహమ్మారి పట్టి పీడిస్తూనే ఉంది. ఈనేపధ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచనపల్లికి చెందిన మరో గర్భిణి భవాని చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. గర్భిణి భవాని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.