ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిమ్స్‌ భవనంపైకెక్కి రోగి హల్‌చల్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 29, 2017, 10:53 AM

పంజాగుట్ట :  ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి సంబంధించిన వైద్యులు సరిగ్గా వైద్యసేవలను అందించడం లేదంటూ నిమ్స్‌ ఆస్పత్రి పాత భవనంపైకెక్కి ప్రదీప్‌ అనే యువకుడు హల్‌చల్‌ చేశాడు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో చికిత్స పొందుతున్న ప్రదీప్‌ పలుమార్లు వైద్యులను కలిసి మొరపెట్టుకున్నా సరైన వైద్యం చేయటం లేదని.. ఇప్పటికైన వైద్యం అందించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని నిమ్స్‌ భవనంపైకి ఎక్కి బెదిరించాడు. మెరుగైన చికిత్స కోసం తనను అమెరికా పంపించాలని డిమాండ్‌ చేశాడు. నిమ్స్‌ సిబ్బంది ఇచ్చిన సమచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పంజాగుట్ట ఎస్సై లింగారెడ్డి, ఆస్పత్రి వైద్యులు సదరు యువకుడి డిమాండ్లు తీరుస్తామని హామీ ఇవ్వడంతో యువకుడు కిందకు దిగి వచ్చాడు. యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com