హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో సిట్ విచారణ కొనసాగుతోంది. నిన్న సినీనటుడు రవితేజను విచారించిన సిట్ అధికారులు ఈరోజు ఆయన మాజీ డ్రైవర్ శ్రీనివాస్‌రావును విచారిస్తున్నారు. ఈ ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్‌ను ఐదో అంతస్తులో అధికారులు విచారణ చేపట్టారు. రవితేజ వద్ద గతంలో శ్రీనివాసరావు కారుడ్రైవర్‌గా పనిచేశారు.
శుక్రవారం సిట్ బృందం ముందు హాజరైన రవితేజను దాదాపు 9 గంటలపాటు అధికారులు విచారించారు. మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు తనకు లేదని, కెల్విన్ సహా మత్తుమందుల సరఫరాదారులెవరూ తనకు తెలియదని రవితేజ చెప్పినట్లు సమాచారం. సిట్ అధికారులకు గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించారు.