హైదరాబాద్ : నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శామీర్పేటలో గల యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, యూనివర్సిటీ చాన్స్లర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ తో పాటు లా విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్.. 49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయ శాస్ర్త పట్టాలను అందజేశారు.