న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల ఓ అభిమానిపై ఫైర్ అయింది. ట్విట్టర్లో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం నడిచింది. మీ తల్లి చైనీస్ కాబట్టే.. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా అని ఆ అభిమాని జ్వాలను అడగటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు అని జ్వా అతనికి వార్నింగ్ ఇచ్చింది. తనతోపాటు తన తల్లి ఓ పాట పాడుతున్న వీడియోను జ్వాల ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాతే ఆ అభిమాని.. మీరు యాంటీ నేషనల్, యాంటీ మోదీ అని ఆరోపించాడు. అక్కడి నుంచి జ్వాల, ఆ అభిమాని మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది.