వాహనదారులారా పారాహుషార్ ట్రాఫిక్ ఉల్లంఘనకు తప్పదు భారీమూల్యం. ఎల్లుండి నుంచి పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రానుంది. మద్యం తాగి బండి నడిపితే.. సిగ్నలే కదా అని జంప్ చేస్తే హెల్మెట్ ఎందుకులే అని లైట్ తీసుకుంటే షార్ట్‌కట్ అని రాంగ్‌రూట్‌లో వెళ్తే ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే.. ఇలా యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కాకపోతే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవడం ఖాయం. ప్రతి ఉల్లంఘనకు పక్కాగా పాయింట్లు లెక్కగడుతున్నారు పోలీసులు. మొత్తం పాయింట్లు 12కు చేరితే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినట్టే. ఆపై మళ్లీ వాహనం నడిపితే జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు దేశంలోనే తొలిసారిగా ఆగస్టు 1వ తేదీ నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.