కాంగ్రెస్ నేతలు తమ ఉనికి కోసం నేరెళ్ల అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్ మండిపడ్డారు. దళితులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందని నిప్పులు చెరిగింది. దళితులపై కాంగ్రెస్ పార్టీ మొసలికన్నీరు కారుస్తుందని ధ్వజమెత్తారు. దళితులను హింసించిన చరిత్ర కాంగ్రెస్‌దేనని పేర్కొన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. దళితులకు మూడెకరాల భూమి, కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.