హైదరాబాద్ : శ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, భద్రాద్రి ఆలయ ఈవో మంగళవారం కలిశారు. భద్రాద్రి ఆలయ తుది నమూనాను చినజీయర్ స్వామికి మంత్రి తుమ్మల చూపించారు. ఆలయ నమూనా రూపకల్పన అద్భుతంగా ఉందని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. ఆలయ మొదటి ప్రాంగణాన్ని రాతి కట్టడంతో నిర్మించాలని స్వామి సూచించారు. ఇండ్లు కోల్పోతున్న వారికి మెరుగైన ప్యాకేజీ అందించాలని ఆలయ ఈవోకు మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆమోదం కోసం ఆలయ తుది నమూనాను పంపించాలని ఈవోకు మంత్రి సూచించారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు.