అక్రిడేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం సదరు సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు వారు పనిచేస్తున్న ఆధారాలు, అనుభవంతో కూడిన పాత్రలను జతచేసి ఆగస్టు 16 తారీకులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తుంది. దరఖాస్తు ఫారాలను ఐ అండ్ పీ ఆర్, డీపీఆర్వో కార్యాలయాల్లో నేరుగా పొందవచ్చు అని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టీయూడబ్ల్యూజే కోరింది.