భూపాలపల్లి పట్టణ కేంద్రంలో డీఎస్ పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలించాలని కోరుతూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలను నిరోధించేందుకు అందరూ ఐకమత్యంగా ముందుకు సాగాలని డీఎస్ పీ శ్రీనివాస్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ర్యాలీలో సీఐ వేణుతోపాటు ఎస్ ఐ వెంకట్రావు, జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బాలుర జూనియర్ కళాశాలలో ఎక్సైజ్ అధికారులు యాంటీ డ్రగ్స్ అవేర్ నెస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. డ్రగ్స్ కు దూరంగా ఉండటంతోపాటు సమాజం నుంచి డ్రగ్స్ ను పారద్రోలారని ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.