వాషింగ్టన్: వచ్చే 100 ఏళ్లలో భూమిపై రెండు నుంచి 4.9 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. ‘రెండు డిగ్రీలను లక్ష్యంగా పెట్టుకోవడం ఉత్తమమని మా విశ్లేషణలో తేలింది. అన్ని విధాలుగా కృషిచేస్తే దీన్ని 80 ఏళ్లలో సాధించొచ్చు’అని అమెరికాలోని వాషింగ్టన్ వర్సిటీ అధ్యాపకులు ఎడ్రియన్ రాఫెరీ తెలిపారు. ప్రపంచ జనాభా, తలసరి స్థూల దేశీయోత్పత్తి, ఓ డాలరు ఆర్థిక వృద్ధి సమయంలో విడుదలయ్యే ఉద్గారాలపై పరిశోధనలో దృష్టి కేంద్రీకరించారు. ఈ అంశాలకు సంబంధించి గత 50 ఏళ్ల సమాచారాన్ని ప్రత్యేక గణన పద్ధతుల్లో విశ్లేషించారు. అనంతరం 2100 నాటి పరిస్థితులపై అంచనాలకు వచ్చారు.