హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విచిత్రమైన పరిస్థితిని తెలంగాణలో చూస్తున్నమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ ప్రగతి భవన్ జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ది దివాళకోరు రాజకీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన విద్యుత్ క్రమబద్ధీకరణ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం వెనుక కాంగ్రెస్ హస్తం ఉండటంతో ఈ సందర్భంగా కాంగ్రెస్ పై ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా చిత్తశుద్ధితో ఉద్యమం చేయలేదన్నారు. కాంగ్రెస్ నేతలను ప్రజలే తిరస్కరించారన్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో తమకే అధికారం వస్తుందని కాంగ్రెస్ ఆశించిందని.. అధికారం రాకపోవడంతో తెలంగాణ అభివృద్ధి చెందకుండా ప్రతి విషయంలో కాలు అడ్డం పెడుతున్నదని ఆయన వాపోయారు.